సినిమాకు తీసుకెళ్తానని చెప్పి యువతిపై అత్యాచారం
AP: సినిమాకు తీసుకెళ్తానని చెప్పి ఓ యువకుడు యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలంలో చోటు చేసుకుంది. 17 ఏళ్ల యువతిని సినిమాకు తీసుకెళ్తానని యువకుడు బైక్పై తీసుకెెళ్లాడు. మార్గమధ్యలో పొలంలోకి తీసుకెళ్లి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటికి వచ్చాక యువతి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో బాధితురాలి తండ్రి కార్వేటి నగరం పోలీసులు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాలి.