AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ చేసిన మల్లికార్జున రావు అనే వ్యక్తిని విజయవాడ పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు. మల్లికార్జున రావు మానసిక పరిస్థితి సరిగ్గా లేదని పోలీసులు గుర్తించారు మద్యం మత్తులో బెదిరింపు కాల్స్ చేసినట్లు పేర్కొన్నారు. అయితే గతంలోనూ మల్లికార్జున రావు ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వైజాగ్‌లో అతనిపై పలు నమోదు అయ్యాయని పోలీసులు తెలిపారు.