AP: అనంతపురం జిల్లా రాయదుర్గంలో విషాదం చోటు చేసుకుంది. ఓ థియేటర్‌లో పుష్ప-2 సినిమా చూస్తూ మద్దానప్ప (37) అనే అభిమాని మృతి చెందాడు. షో ముగిసినా అతను సీటులోనే ఉండటంతో ప్రేక్షకులు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. మద్దానప్ప చనిపోయినట్లు గుర్తించి వారు కుటుంబీకులకు సమాచారమిచ్చారు. అయితే మద్దానప్ప తొక్కిసలాటలో చనిపోయి ఉంటాడనే అనుమానంతో బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.