హత్యాచార ఘటనకు ముందు 2 రెడ్ లైట్ ఏరియాలకు వెళ్లిన నిందితుడు

60చూసినవారు
హత్యాచార ఘటనకు ముందు 2 రెడ్ లైట్ ఏరియాలకు వెళ్లిన నిందితుడు
కోల్‌కతాలో వైద్యురాలిని రేప్ చేసి, దారుణంగా హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్.. నేరానికి కొన్ని గంటల ముందు రెండు రెడ్ లైట్ ఏరియాలకు వెళ్లాడని 'ది టెలిగ్రాఫ్' కథనం పేర్కొంది. 'తాను ఆసుపత్రికి వచ్చే ముందు కాళీఘాట్లోని రెడ్ లైట్ ఏరియాకు వెళ్లాను. ఆ తర్వాత ఆస్పత్రికి వచ్చి సోవాబజార్ లోని మరో రెడ్ లైట్ ఏరియాకు వెళ్ళాను' అని రాయ్ చెప్పాడని ఓ పోలీసు అధికారి తెలిపారు. అక్కడి నుంచి తిరిగొచ్చి రాయ్ ఈ నేరం చేశాడని ఆ అధికారి వెల్లడించారు.

సంబంధిత పోస్ట్