బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఓ యువకుడికి బలవంతంగా వివాహం జరిపించారు. ప్రమోద్, రోష్ని అనే యువతి గత రెండేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అయితే ప్రమోద్‌కి రైల్వేలో ఉద్యోగం రావడంతో పెళ్ళికి కట్నంగా పది లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. అంత మొత్తం ఇచ్చుకోలేని యువతి.. తనతో మాట్లాడాలని చెప్పి ఆ యువకుడిని సమీపంలోని విద్యాపతిధామ్ ఆలయానికి రప్పించింది. అతడు రాగానే.. అక్కడే ఉన్న అమ్మాయి కుటుంబీకులు వారిద్దరికీ వివాహం జరిపించారు.