ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిది కొడంగల్ కాదని.. వారు వలస వచ్చారని చెప్పారు. రేవంత్ రెడ్డి సీఎం అయితే తమ నియోజకవర్గం బాగుంటుందని ప్రజలు గెలిపిస్తే ఆయనేమో జనాలపై కక్ష కట్టారని దుయ్యబట్టారు. లగచర్ల బాధితులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పంతాలకు పోవద్దని, ప్రజల ఆకాంక్షలను గౌరవించాలని సూచించారు.