నేటి నుంచి రోహిణి కార్తె ప్రారంభం

65చూసినవారు
నేటి నుంచి రోహిణి కార్తె ప్రారంభం
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. గ్రహాలకు రాజుగా పరిగణించే సూర్యుడు ఇవాళ రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఇదే నక్షత్రంలో జూన్ 8వ తేదీ వరకు ఉంటాడు. ఈ పక్షం రోజుల పాటు ఎండలు మరింత మండిపోతాయి. నాలుగు నెలలుగా వచ్చే వేడి గాలులు ఒక ఎత్తు అయితే.. కేవలం ఈ కార్తె సమయంలో మాత్రం రోళ్లు పగిలేంత ఎండలు పెరిగిపోతాయి. ఈ పక్షం రోజుల్లో సూర్యుడి తీవ్రత తీవ్ర స్థాయికి చేరుకుని, కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది.