రైలులో ఓ యువకుడు గంజాయి తాగుతూ పట్టుబడ్డాడు. అతడిని రైల్వే పోలీసు రైలులోనే చెంపదెబ్బలు కొట్టాడు. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో స్పష్టంగా తెలియరాలేదు. రైలులో యువకుడు గంజాయి తాగుతూ ఇతరులకు ఇబ్బంది కలిగించడంతో కొంతమంది అతడిపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. RPF అధికారి వెంటనే అక్కడికి చేరుకుని యువకుడిని ప్రశ్నించగా, తాను గంజాయి తాగలేదని బుకాయించాడు. దీంతో పోలీస్ యువకుడిని కొట్టాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.