ఏపీలో నూతన రహదారుల నిర్మాణం, విస్తరణ పనుల్లో వేగం పెరిగింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నో రోజులుగా స్తబ్ధుగా ఉన్న ప్రాజెక్టులకు సైతం మోక్షం కలుగుతోంది. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాలో రెండు కీలక ప్రాజెక్టులు చేపడుతున్నారు. వాడరేవు - పిడుగురాళ్ల జాతీయ రహదారి, కొండమోడు- పేరేచెర్ల జాతీయ రహదారి విస్తరణ పనులను చేపడుతున్నారు. సుమారుగా రెండు వేల కోట్ల వ్యయంతో ఈ రెండు కీలక ప్రాజెక్టులను చేపడుతున్నారు.