ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో గణతంత్ర వేడుకలకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో 5000 మంది కళాకారులు పలు నృత్యాలు ప్రదర్శించనున్నారు. దేశ సంస్కృతిని చాటేలా సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ సంయుక్తంగా ఐదు వేల మంది కళాకారులతో 45 నృత్య రీతుల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడంతో అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు.