రష్యా స్పై తిమింగలంగా వార్తల్లోకెక్కిన 'హ్వాల్దిమిర్' అనే బెలుగా తిమింగలం మృతిచెందింది. 14 అడుగుల పొడవు, 2,700 పౌండ్ల బరువు కలిగిన ఇది ఆగస్టు 31న స్టావంజర దగ్గరలోని బే ఆఫ్ రిసవికాలో మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. 2019లో సౌత్ నార్వేలోని హామర్‌ఫెస్ట్ సమీపంలో మొదటిసారిగా ఈ తిమింగలం కనిపించింది. దీని మెడకు సెయింట్ పీటర్స్ బర్గ్ అనే లేబుల్ ఉండటంతో ఇది రష్యా నిఘా వర్గంలో భాగమనే వార్తలు వచ్చాయి.