ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలం అవుతోంది. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి (NH 65)పై వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. సూర్యాపేట వద్ద రహదారిపైకి వరదనీరు పోటెత్తడంతో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో హైదరాబాద్ - విజయవాడ వెళ్లే వాహనాలను నార్కట్ పల్లి- అద్దంకి, ఖమ్మం వైపు దారి మళ్లించారు. కోదాడ-రామాపురం చెక్ పోస్ట్ వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. కోదాడ వద్ద హైవేపై ఒక్కవైపు మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నారు.