శ్రీవారిని దర్శించుకున్న సంయుక్త మీనన్

51చూసినవారు
తిరుమల శ్రీవారిని నేడు తమిళ హీరోయిన్ సంయుక్త మీనన్ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. స్వామి వారి దర్శనం చాలా బాగా జరిగిందని, సంతోషంగా ఉందిని అన్నారు. తిరుపతి అంటే తనకు చాలా ఇష్టమని, స్వామి వారిని దర్శించుకుంటే తనకు మంచి జరుగుతుందని నమ్మకమని అన్నారు. అలాగే ఈ సంవత్సరం తనకు చాలా ముఖ్యమైందని, చాలా సినిమాలకు సంతకం చేసినట్లు పెర్కొన్నారు.