3 నెలలకోసారి పింఛను తీసుకోవచ్చు: CBN
APలో పెన్షనర్లకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడారు. ‘64 లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్లు అందిస్తోంది. గతంలో పెన్షన్ ఒక నెల తీసుకోెకపోతే ఆగిపోయేది. మా ప్రభుత్వంలో పెన్షన్ మొత్తాన్ని మూడు నెలలకోసారి తీసుకోవచ్చు’ అని చంద్రబాబు అన్నారు. పెన్షన్ ఎవరు ఆపినా నిలదీయాలని లబ్ధిదారులకు పిలుపునిచ్చారు. పెన్షన్ తీసుకోవడం ప్రజల హక్కని, ఇంటి వద్దకే చేరేలా చర్యలు తీసుకుంటామన్నారు.