మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై మహిళ ఫిర్యాదు

586చూసినవారు
మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై ఇవాళ విజయవాడకు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో తనకు కాంట్రాక్టులు ఇప్పిస్తానని ఆశచూపి శారీరకంగా వాడుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తన వద్ద రూ.90 లక్షల వరకు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొంది. తనలాగే చాలా మంది మహిళల జీవితాలను నాశనం చేశారని ఆమె ఆరోపించింది. పోలీసులు, ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని బాధిత మహిళ కోరింది.

సంబంధిత పోస్ట్