సంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జుక్కల్ లో గురువారం దారుణ ఘటన జరిగింది. గ్రామ చెరువు దగ్గర ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేశారు. స్థానికులు మృతుడు ర్యాల మడుగుకి చెందిన మహేశ్ అనే యువకుడిగా గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.