ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని.. పిసిసి సభ్యుడు డాక్టర్ సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రం సంగారెడ్డిలో కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమంలో పాల్గొని ఆయన మీడియాతో మాట్లాడారు. సవరించిన చట్టం ప్రకారం పోడు భూముల రైతులకు భూమి పట్టా సర్టిఫికెట్ ఇవ్వాలన్నారు. వ్యవసాయ భూమికి ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. ధరణి పోర్టల్ వ్యవస్థలో అక్రమాలు చోటుచేసుకుని, చాలామంది అర్హులకు ప్రభుత్వం నుండి అందాల్సిన సంక్షేమ ఫలం రైతుబంధు రావడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే పోడు భూముల రైతులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.