పటాన్చెరు డివిజన్ పరిధిలోని సీతారామపురం కాలనీలో ప్రవేశ ద్వారం రోడ్డు భారీ వర్షాలకు దెబ్బతిని గుంతల మయంగా మారి కాలనీవాసులకు చాలా ఇబ్బంది కలుగుతుందని కాలనీ వాసులు మంగళవారం కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ని కలిసి రోడ్డు బాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. తక్షణమే స్పందించిన కార్పొరేటర్ జిహెచ్ఎంసి సిబ్బందిని పురమాయించి రోడ్డు చదును చేయించి, మట్టి వేయించారు.