మాజీ మంత్రి రోజాపై కర్నూలులో ఫిర్యాదు
AP: దళితులను అవమానించేలా ప్రవర్తించిన మాజీ మంత్రి రోజాపై కేసు నమోదు చేయాలని కర్నూలు 3వ పట్టణ పీఎస్లో రాయలసీమ దండోరా నాయకులు ఫిర్యాదు చేశారు. రోజా మంత్రిగా ఉన్నప్పుడు మనోహర్ అనే ప్రభుత్వ ఉద్యోగి చేత చెప్పులు మోయించారని, ఇది దళితులను అవమానపరచడమే అని రాయలసీమ దండోరా అధ్యక్షుడు అనంతరత్నం అన్నారు. ఈ మేరకు సీఐ శేషయ్యకు ఫిర్యాదు అందజేశారు. రోజాకు దళితులంటే చులకన అని, ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు అనంతరత్నం కోరారు.