భారీ వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో సెలవు

81చూసినవారు
భారీ వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో సెలవు
ఏపీలోని చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు ఇవాళ అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలకు కచ్చితంగా సెలవు ఇవ్వాలని స్పష్టం చేశారు. మరోవైపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోనూ సెలవు ప్రకటించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్