AP: రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులతో పాటు కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూటమి ప్రభుత్వం కల్పించింది. నేటి (సోమవారం) నుంచి నుంచి 28 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హులైన వారికి సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులపై వైసీపీ రంగులతో పాటు జగన్ బొమ్మను ముద్రించిన విషయం తెలిసిందే. వాటి స్థానంలో కొత్త కార్డులు ఇవ్వనున్నారు.