కలెక్టరేట్ ముందు దళిత సంఘాల ధర్నా

50చూసినవారు
కోహిర్ మండలం బడంపేట గ్రామానికి చెందిన నర్సింలు మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దళిత సంఘాల ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. నర్సింలు మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోకుంటే ఉదృతం చేస్తామని నాయకుడు తెలిపారు. నాయకులు అశోక్, రవి కుమార్, నాగరాజు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్