విద్యార్థులు, యువకులు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ అన్నారు. సంగారెడ్డి పట్టణంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పొగాకు వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. మంచి ఆహారపు అలవాట్లను నేర్చుకోవాలని చెప్పారు.