ముంతాజ్‌ అలీ జాడ కోసం నదిలో కొనసాగుతున్న గాలింపు (వీడియో)

580చూసినవారు
కర్ణాటకలోని మంగళూరు నియోజకవర్గంలో కనిపించకుండా పోయిన వ్యాపారవేత్త ముంతాజ్‌ అలీ జాడ కోసం ఫాల్గుణి నదిలో రెండవ రోజూ గాలింపు కొనసాగుతోంది. ఆదివారం తెల్లవారుజామున కారులో ఇంటి నుంచి బయలుదేరిన అలీ తిరిగి రాకపోవడం, ఉదయం కులూర్‌ వంతెనపై కారు పార్క్‌ చేసి ఉండటంతో ఆయన ఏమయ్యారనేది మిస్టరీగా మారింది. ముంతాజ్‌ కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నదిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడనే అనుమానంతో అధికారులు గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్