హేమ కమిటీ రిపోర్టులో దిగ్భ్రాంతికర అంశాలివే!

64చూసినవారు
హేమ కమిటీ రిపోర్టులో దిగ్భ్రాంతికర అంశాలివే!
లైంగిక సాన్నిహిత్యంతోపాటు ‘అడ్జస్ట్‌మెంట్స్‌, ‘కాంప్రమైజ్‌’ అనే పదాలు మలయాళం ఇండస్ట్రీలో సర్వసాధారణమని జస్టిస్‌ హేమ కమిటీ గుర్తించింది. స్టార్‌డమ్‌ పెరిగే కొద్ది వేధింపులు ఎక్కువవుతాయని పేర్కొంది. ఏ ఒక్కరిపైనా వేధింపుల గురించి ఫిర్యాదు చేసినా.. ఆ ఒక్క సినిమాలో అవకాశం కోల్పోవడమే కాకుండా పూర్తిగా ఇండస్ట్రీకే దూరమవుతామనే భయంతో ఎవరూ ఫిర్యాదు చేయడం లేదని తెలిపింది. పారితోషికంపై అగ్రశ్రేణి నటులు మినహా ఇంకెవరికీ రాతపూర్వక ఒప్పందం ఉండదని కమిటీ గుర్తించింది.