అమెరికాలో ఓ పోలీసు అధికారి కుక్కలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కుక్కలు మృతి చెందాయి. ఫిలడెల్ఫియాలోని మాంటువా పరిసరాల్లో బుధవారం ఓ వీధిలో నాలుగు కుక్కలు 53 ఏళ్ల వ్యక్తిపై విచక్షణ రహితంగా దాడి చేశాయి. ఆ సమయంలో అక్కడే పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు కుక్కలను వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. కానీ పరిస్థితి చేయి దాటడంతో పోలీస్ అధికారి కుక్కలపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.