BREAKING: ఆస్పత్రి నుంచి రజినీకాంత్ డిశ్చార్జ్
తమిళనాడులోని చెన్నైలో ఉన్న అపోలో ఆస్పత్రి నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ డిశ్చార్జ్ అయ్యారు. నాలుగు రోజుల క్రితం ఛాతినొప్పితో ఆయన ఆస్పత్రిలో చేరారు. రక్తనాళంలో వాపు ఉందని గుర్తించిన వైద్యులు స్టంట్‌ను అమర్చారు. ప్రస్తుతం రజినీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది. దాంతో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా, రజినీకాంత్ లేటెస్ట్ చిత్రం ‘వేట్టయాన్’ ఈ నెల 10న థియేటర్లలో విడుదల కానుంది.