అజ్ఞాతం వీడని పేర్ని నాని కుటుంబం.. పోలీసుల గాలింపు
AP: 3,708 బస్తాల రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో అడ్డంగా బుక్కైన పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. పేర్ని నాని కుటుంబం కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. బందరు మండలం పొట్లపాలెంలో జయసుధ పేరిట పేర్ని నాని గోదాము నిర్మించగా.. అందులో బియ్యం మాయంపై కేసు నమోదైంది. వీరు విదేశాలకు వెళ్లిపోకుండా లుకౌట్ సర్క్యులర్‌పై పోలీసులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.