AP: శ్రీకాకుళం జిల్లా పలాస మండలం చినబాడాం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు కూర్మాపు ధర్మారావు, అంపోలు శ్రీనును కిడ్నాప్ చేశారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఆదివారం రాత్రి డీఎస్పీ పిలుస్తున్నారని చెప్పి కూర్మాపు ధర్మారావు, అంపోలు శ్రీనును బయటకు తీసుకెళ్లారని మాజీ మంత్రి అప్పలరాజు అన్నారు. టీడీపీ నేతలు, పోలీసులకు వ్యతిరేకంగా ఆయన నినాదాలు చేశారు.