AP: గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లారని, వారి ఆచూకీ తెలిపిన వారికి రూ.1,116 ఇస్తానని అన్నారు. అనంతరం జగన్ విధానాలు నచ్చకే వైసీపీ నేతలు పార్టీని వీడుతున్నారని చెప్పారు.