AP: శ్రీకాకుళం జిల్లా పలాసలో బిహార్ ముఠా హల్‌చల్ చేసింది. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీకి చెందిన ఓ టీడీపీ నేత హత్యకు కుట్ర పన్నినట్లు సమాచారం. ఓ ప్రధాన పార్టీకి చెందిన వ్యక్తులు బిహార్ గ్యాంగ్‌కు రూ.10 లక్షలు సుపారీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులు ముగ్గురు బిహార్ వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి నాటు తుపాకీలు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాలి.