AP: రాజ్యసభ ఉపఎన్నికల్లో ఏపీ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు సభ్యులు సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, సానా సతీశ్ రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేయనున్నారు. టీడీపీ నుంచి సానా సతీశ్, బీదా మస్తాన్ రావుకు, బీజేపీ నుంచి ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ టికెట్ కేటాయించిన విషయం తెలిసిందే. పోటీలో ఎవరూ లేకపోవడంతో ఈ ముగ్గురు ఏకగ్రీవం అయ్యారు.