సైదాపూర్ మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంత సుధాకర్, మాజీ మండల అధ్యక్షుడు రవీందర్ రావు, జిల్లా అధికార ప్రతినిధి మేకల రవీందర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు లంకదాసరి మల్లయ్య, బీసీ సెల్ మండల అధ్యక్షుడు పోగు రమేష్, తదితరులు పాల్గొన్నారు.