ఓటర్ డ్రాఫ్ట్ జాబితాలో ఈనెల 29వ తేదీన విడుదల చేస్తామని కలెక్టర్ వల్లూరు క్రాంతి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 29 నుంచి నవంబర్ 28వ తేదీ వరకు ఓటరు జాబితా పై అభ్యంతరాలను స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఓటర్ జాబితా కోసం ఈనెల 26వ తేదీలోపు బిఎల్వోలు ఇంటింటి తనిఖీలు పూర్తి చేయాలని చెప్పారు. జాబితాలో తప్పులు లేకుండా చేసుకోవాలని సూచించారు.