Mar 01, 2025, 10:03 IST/
తల్లికి వందనం పథకంపై చంద్రబాబు మరో అప్డేట్
Mar 01, 2025, 10:03 IST
AP: తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు శనివారం మరో అప్డేట్ ఇచ్చారు. ఇంట్లో ఎందరు పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం కింద రూ.15వేలు సాయం చేస్తామని తెలిపారు. పిల్లల ఖర్చుల బాధలు, తగ్గించే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. త్వరలోనే రైతులకు, మత్స్యకారులకు రూ.20 వేలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. జూన్‌లోగా డీఎస్సీ భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.