జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పట్టణ కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ ధర్మపురి జడ్పీటీసీ సభ్యురాలు బత్తిని అరుణ - మల్లయ్యల కుమారుడు ప్రముఖ యువ న్యాయవాది బత్తిని ఇంద్ర కరణ్ గురువారం మధ్యాహ్నం ధర్మపురి శాసన సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కోప్పుల ఈశ్వర్ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ పట్టణ కేంద్రంలో గల స్థానిక నిమ్స్ ఆసుపత్రి యందు గల బ్లడ్ బ్యాంకు రక్త నిధికి వెళ్లి బి పాజిటివ్ రక్తాన్ని ఏడవ సారి రక్తదానం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోయిన సంవత్సరం ఈ సంవత్సరం సంక్షేమ శాఖ మంత్రి జన్మదినం సందర్భంగా రెండు సార్లు స్వచ్ఛందంగా తదుపరి అత్యవసర పరిస్థితులలో ఐదు సార్లు మొత్తం ఏడు సార్లు బి పాజిటివ్ రక్తాన్ని దానం చేసినట్టు ఆయన మీడియాకు తెలిపారు. యువత అత్యవసర పరిస్థితులలో వెంటనే స్పందించి రక్తదానం చేయండి చరిత్రలో యువత ప్రాణ దాతలుగా నిలవండి అని ఆయన యువతకు పిలుపు ఇచ్చారు. రక్తదానం చేసిన ప్రముఖ యువ న్యాయవాది బత్తిని ఇంద్ర కరణ్ ను బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఆయన మిత్రులు, అనుచరులు, సహచర న్యాయవాదులు తదితరులు అభినందించారు.