ధర్మారం మండలం నంది మేడారంలో గురువారం సర్పంచ్ సామంతుల జానకి- శంకర్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. దీనిలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ స్తంభాలు, తాగునీటి సమస్య మొదలగు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఉపసర్పంచ్ కట్ట రమేష్, పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్, గ్రామస్తులు పాల్గొన్నారు.