అకాల వర్షాల తాకిడితో నష్టపోయిన రైతుల సమస్యలతో పాటుగా పలు నష్టాల విషయాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి భాధితులకు న్యాయం చేయాలని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ బీజేపీ నాయకులు తహసీల్దార్ కోడెం కనకయ్యకు వినతి పత్రం ఇచ్చారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పిలుపు మేరకు సోమవారం బీజేపీ మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి నాయకులతో తహసీల్దార్ ను కలిశారు.