ప్రభుత్వ విప్ గా నియమించిన తర్వాత మొదటిసారిగా వేములవాడకు వచ్చిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు కథలాపూర్ మండల నాయకులు ఆదివారం ఘనంగా స్వాగతం పలికారు. మండలానికి చెందిన మత్యకార రాష్ట్ర కార్యదర్శి కల్లెడ గంగాధర్, జిల్లా కార్యదర్శి గోపిడి ధనుంజయ్ పుష్పగుచ్ఛం అందించి అభినందించి స్వాగతం పలికారు.