పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో పలువురు దాతల సహాయంతో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమం సామాజిక కార్యకర్త తుమ్మ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా 100వ రోజు ముగించుకుంది. ఈ సందర్భంగా గౌతి లిఖిత - ప్రసాద్ రెడ్డి కుమారులు సూర్య కిరణ్ రెడ్డి, స్వరన్ చంద్రారెడ్డి, సాయి సూర్య మోటార్స్ సుల్తానాబాద్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే 100వ రోజు కార్యక్రమం సందర్భంగా అల్లం భాగ్యలక్ష్మి- సత్యనారాయణ దుప్పట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎంపీపీ బాలాజీ రావు ముఖ్య అతిధిగా హాజరై అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిర్విరామంగా కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అనేది చాల గొప్ప విషయం అని ఈ కార్యక్రమానికి నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని. ఈ సందర్భంగా అన్నారు. అనంతరం మాజీ ఎంపిటిసి పల్లా సురేష్ మాట్లాడుతూ అనేక సందర్భాల్లో మట్టి వినాయక విగ్రహాలు పలువురు దాతల సహాయంతో గత నాలుగు సంవత్సరాలు ఉచితంగా పంపిణీ చేశారని, శుభ కార్యక్రమాలలో మిగిలిన ఆహార పదార్థాలను యాచకులకు, భిక్షాటన చేసే వారికి చాలా సందర్భాల్లో ఇచ్చారని ఈ సందర్భంగా అన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ లెక్కల నగేష్, కామని రాజేంద్రప్రసాద్, పారుపెళ్లి సాజయ్ కుమార్, రాజోజుల శివ, బొమ్మినేని రాజేష్, దేవరకొండ మణిదీప్, వేముల నరేష్, శెట్టి శ్రీను, ఎనగంటి నరేష్ తదితరులు పాల్గొన్నారు.