సంక్రాంతికి మరో ఆరు ప్రత్యేక రైళ్లు

539చూసినవారు
సంక్రాంతికి మరో ఆరు ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే మరో ఆరు ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ నెల 12 నుంచి 20 వరకు రైళ్లు నడువనున్నాయి. సికింద్రాబాద్‌-బరంపురం, హైదరాబాద్‌-బరంపురం స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు. ఆయా రైళ్లను ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరింది. ఆయా రైళ్లలో సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీ, స్లీపర్‌ క్లాస్‌, జనరల్‌ క్లాస్‌ కోచ్‌లు ఉంటాయని పేర్కొంది.

ట్యాగ్స్ :