SLBC టన్నెల్ ప్రమాదం.. చివరి దశకు సహాయక చర్యలు

81చూసినవారు
TG: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) టన్నెల్ ప్రమాదంలో సహాయక చర్యలు చివరి దశకు చేరుకున్నాయి. సొరంగంలో జీపీఆర్‌, అక్వాఐతో బురదలో ఊరుకుపోయిన అవశేషాలను గుర్తించగలిగారు. భారీగా పేరుకుపోయిన బురదను తొలగించి.. మృతదేహాలను వెలికి తీసే పనిలో సహాయక బృందాలు ఉన్నాయి. ప్రమాదం జరిగిన స్థలంలో 200 మీటర్ల పొడవు, 9.2 మీటర్ల ఎత్తులో బురద, మట్టి, రాళ్లు పేరుకుపోయాయి. వాటిని తొలగించి మృతదేహాలను బయటకు తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్