మనాలీని మంచు దుప్పటి కప్పేసింది. మంచు భారీగా కురవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోహ్‌తంగ్‌లోని సొలాంగ్, అటల్ టన్నెల్‌ల మధ్య సోమవారం రాత్రి తర్వాత దాదాపు 1000కి పైగా వాహనాలు చిక్కుకుపోయాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటివరకు 700 మంది పర్యటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం అటల్ టన్నెల్ మార్గంలో వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు.