BJP విధానాల వల్లే సైనికులు బలి: రాహుల్

79చూసినవారు
BJP విధానాల వల్లే సైనికులు బలి: రాహుల్
జమ్మూకాశ్మీర్‌లోని దోడాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఆర్మీ జవాన్లు మృతి చెందిన ఘటనపై రాహుల్ గాంధీ స్పందించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో అమరులైన సైనికులకు నివాళులు అర్పించారు. బీజేపీ అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్లే సైనికులు బలైపోతున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటివి ఒకదాని తర్వాత మరొకటి జరగడం బాధాకరమన్నారు. పదేపదే భద్రతా లోపాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్