స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి స్వల్ప లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 33.02 పాయింట్ల లాభంతో 81086.21 పాయింట్ల వద్ద, నిఫ్టీ 11.70 పాయింట్ల లాభంతో 24823.20 వద్ద స్థిరపడ్డాయి. బజాజ్ ఆటో, టాటా, సన్ ఫార్మా, ఎయిర్‌టెల్ వంటి కంపెనీలు టాప్ లో నిలిచాయి. ONGC, విప్రో, దివీస్, ఏషియన్ పెయింట్స్ వంటి సంస్థలు నష్టాలను చవి చూశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 4 పైసలు పెరిగి 83.89గా ముగిసింది.