లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

74చూసినవారు
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఐటీ, ప్రైవేటు బ్యాంక్‌ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో రోజంతా ఓ మోస్తరు స్థాయిలో కదలాడిన సూచీలకు ఆఖర్లో కొనుగోళ్లు కలిసొచ్చాయి. దీంతో సెన్సెక్స్‌ 566.63 పాయింట్ల లాభంతో 76,404.99 వద్ద ముగిసింది. నిఫ్టీ 130.70 పాయింట్ల లాభంతో 23,155.35 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 25 పైసలు బలపడి 86.33 వద్ద ముగిసింది.

ట్యాగ్స్ :