రెండు వందేభారత్‌ రైళ్లపై రాళ్ల దాడి

582చూసినవారు
రెండు వందేభారత్‌ రైళ్లపై రాళ్ల దాడి
దేశంలో గడచిన 24 గంటల్లో రెండు వందేభారత్ రైళ్లపై దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. మొదటి సంఘటన బుధవారం రాత్రి యూపీలోని లక్నో- పట్నా వందే భారత్‌పై జరగగా, రెండో ఘటన గురువారం ఉదయం రాంచీ నుంచి పట్నా వెళ్తున్న వందేభారత్ రైలుపై జరిగింది. ఈ రాళ్ల దాడిలో రైలు కిటికీ అద్దాలు పూర్తిగా పగిలిపోయినట్లు సమాచారం. అయితే, ప్రయాణికులెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనలపై ఆర్పీఎఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్