సమ్మె.. 70 శాతం విమానాలు రద్దు

50చూసినవారు
సమ్మె.. 70 శాతం విమానాలు రద్దు
ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లోనిఓర్లీ విమానాశ్రయంలో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్స్‌ సామూహిక సమ్మెకు దిగడంతో విమానాశ్రయం ఒక్కసారిగా బోసిపోయింది. ఈ సమ్మె కారణంగా దాదాపు 70 శాతానికి పైగా విమానాలు రద్దయ్యాయి. ఈ మేరకు ఫ్రాన్స్‌ పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. జులై 26న పారిస్‌ ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవానికి నగరం సిద్ధమవుతున్న తరుణంలో ఈ సమ్మె జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

సంబంధిత పోస్ట్