తెలంగాణ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని మల్లికార్జున కాలనీలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థినిని బైక్ ఢీకొట్టింది. రోడ్డు దాటుతుండగా యువకులు అతివేగంతో వచ్చి విద్యార్థినిని ఢీకొట్టారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే విద్యార్థినిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే యువకులు పరారయ్యారు.