అస్సాంలోని పాత్సాలాలో గురువారం షాకింగ్ ఘటన జరిగింది. అనుండోరం బోరూహ్ అకాడమీలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆ సమయంలో ఓ విద్యార్థి కాలేజ్ బిల్డింగ్ మూడో అంతస్థు నుంచి కిందికి దూకేశాడు. దీంతో ఆ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనతో కాలేజీలో కలకలం రేగింది. ఇక ఆ విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. ఆ విద్యార్థి ఎందుకు దూకాడో తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.